Sunday, September 20, 2009
బాపు గారి పెద్దబ్బాయి శ్రీ వేణు + ఒక rough స్కెచ్
బాపు గారి పెద్దబ్బాయి శ్రీ వేణు గారు (బాపు గారు వారి నాన్నగారి పేరు వారి పెద్దబ్బాయికి, రమణ గారి పేరు చిన్నబ్బాయికి పెట్టుకున్నారు) జపాన్ లో వుద్యోగం చేస్తున్నారు. వుద్యోగ వత్తిళ్ళ వల్ల వారు ఇండియాకు తరుచుగా రాలేరు. ఐతే, ఈ మధ్య వారి కార్యాలయ పని నిమిత్తం లండన్ వచ్చి అక్కడ్నించి చెన్నై వస్తున్నారని తెలిసింది. అది ఎలా తెలిసిందంటే బాపుగారు లండన్ లో వున్న used-book స్టోర్స్ వివరాలు గూగుల్ లో వెతికి పెట్టమని నన్ను అడుగుతూ వేణు గారి ప్రయాణం గురించి చెప్పారు. ఆ విషయం తెలియగానే వేణు గారికి used-book stores వివరాలతో పాటు వారు చెన్నై వచ్చినపుడు కలవడానికి అపాయింట్మెంట్ కోరుతూ ఈమెయిలు పంపాను. తప్పకుండా అని జవాబిచ్చారు. Weekend ఐతే నాకు అనువు అని వారికి శని కాని ఆదివారం కానీ కుదురుతుందా అని అడిగితే 22 ఆగస్టు (శని) 2009 మధ్యాహ్నం ౩ గంటలకైతే అనువుగా వుంటుందన్నారు. వెంటనే (అంటే ఆగస్టు 8 న) చెన్నై 22 నాడు మధ్యాహ్నం చేరేలాగా రైలు టికెట్ ఇంటర్నెట్లో తీసుకున్నా. ఒకవేళ 22 న కలవటం కుదరకపోతే 23 నాడైనా కలవవచ్చని తిరుగు ప్రయాణం 22 కాకుండా 23 రాత్రికి చేయించుకున్నాను. 23 వినాయక చవితికి మా వూరు వెళ్ళడం కుదరదు. కాని వేణు గారిని కలవటం మళ్ళీ ఎప్పుడు కుదురుతుందోనని పండగ ప్రయాణం విరమించుకున్నాను.
ఐతే 19 న వేణు గారు మెయిల్ చేస్తూ 23 (ఆది) న పండగని ముందుగా తెలియదని, పండగ రోజు తిరువన్నామళై (రమణ మహర్షి ఆశ్రమం) వెళ్ళాలి 24 (సోమ) న సాయంత్రం కాని 25 ఉదయం కానీ కలవటం కుదురుతుందా అని అడుగుతూ సారీ చెప్పారు. పర్వాలేదని సోమవారం (24) సాయంత్రం కలుస్తానని మెయిల్ చేసాను. బుక్ చేసిన టికెట్లు కాన్సెల్ చేసి మా వూరు వెళ్ళడానికి తత్కాల్, అక్కడ్నించి చెన్నై వెళ్ళి బెంగుళూరుకు చేరేలాగా లాగా తత్కాల్ టికెట్లు బుక్ చేసాను.
పండగకి వూరెళ్ళి మరునాడు బయల్దేరి చెన్నై మధ్యాహ్నం 12 కి చేరాను. ఇంటికి వచ్చి భోజనం చేయమన్నారు బాపు గారు కాని స్టేషన్లోనే భోంచేసాను. బాపు గారింటికి చేరగానే స్నానం చేయమన్నారు. బయట భోంచేసినందుకు నొచ్చుకున్నారు. కాని రైలు ఆలస్యం అయ్యిందని రైల్లోనే తిన్నానని బొంకాను. స్నానం చేసి బాపు గారితో కాసేపు మాట్లాడాను. బాపు గారు వేసుకున్న cartoon /illustration rough స్కెచ్చులు కొన్ని చూసాను.
నాలిగింటికి బాపు గారితో పైఇంట్లో వున్న రమణ గారితో మాట్లాడటానికి వెళ్ళాను. బాపు రమణ గార్లు కాసేపు కోతి కొమ్మచ్చి layout గురించి మాట్లాడుకున్నారు. కాసేపటికి బాపుగారు కిందకు వెళ్ళారు. నేను రమణ గారి దగ్గర కాసేపు కూర్చున్నాను. ఒక కోతి కొమ్మచ్చి అభిమాని (పేరు మర్చిపోయాను) వారం వారం వ్రాస్తారని, ఆ వారం వ్రాసిన ఉత్తరం చూపించారు. కాసేపటికి (దాదాపు 5 . 30 కి ) వేణు గారు వచ్చారు (ట్రాఫిక్ జామ్ వల్ల) ఆలస్యమైందని సారి చెప్పారు. Light పోతుందని తొందరగా మొదలుపెడదామా అని అంటే, అయ్యో వీడియోనా వద్దండి అంటే పక్కనే వున్న శ్రీదేవి గారు (రమణ గారి సతీమణి) పర్వాలేదు అని సర్దిచెబితే ఒప్పుకున్నారు.
వెంటనే డాబా పైన కెమెరా ఏర్పాటు చేసి వేణు గారిని పిలిచాను. 5 . 30 కి మొదలు పెడితే ముగించే సరికి 7 కావచ్చింది. సీతాకళ్యాణం వారు వేసిన బాల రాముడి పాత్ర గురించి, సంగీతంకు సంబంధించి బాపు గారు వారు మాట్లాడుకునే విషయాలు, చిన్నపుడు బాపు వారికి చెప్పిన కథలు ఇంకా చాలా చెప్పారు. వారు వారి busy schedule లో కూడా వారి personal time లో నాకు కొంత సమయం కేటాయించినందుకు థాంక్స్ చెప్పి ముగించాను.
రికార్డింగ్ తర్వాత వేణు గారు బయటకు వెళ్ళారు. నేను బాపు దగ్గరకెళ్ళి కూర్చున్నాను. అపుడు బాపు గారు వేసిన "KVP YSR " బొమ్మను చూపించారు. KVP , YSR portraits ప్రక్కప్రక్కన వేసి, క్రింద కృష్ణార్జునుల బొమ్మ వేసారు. చాలా బాగుంది. తర్వాత బాపు గారి అల్లుడు శ్రీ రంగా గారు వచ్చినపుడు వారితో కాసేపు మాట్లాడాను. 9 కి బాపు గారు ఇంట్లో భోంచేయమంటే భోజనం చేసి స్టేషన్ కి బయలు దేరాను.
(పైన మీరు చూస్తున్న బొమ్మ ఆగస్టు 28 స్వాతి సంచిక 50 వ పేజీలో వచ్చిన బాపు గారి కార్టూను , దాని క్రింద బాపు గారు ఆ కార్టూను కి వేసుకున్న rough స్కెచ్)
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
నేనెంతగానో అభిమానించే బాపు గారు మీకు పరిచయస్థులంటే, మిమ్మల్ని చూసి అసూయగా ఉంది... :(
నాదికూడా బృహఃస్పతి గారి మాటే కానీ..:)
నిజంగా, బాపు గారి పరిచయస్తులుగా మీరు చాలా అద్రుష్టవంతులు. congrats
Sri and Ramana garu are my family friends and I am having a great collection of books,SP,LP records,audio,video Cds,cassettes of MBS.Prasad speeches on Ramana gari writings (Worldspace Radio),9volumes of Bapu Ramana gari albums.
M.V.Appa Rao,Rajahmundry-5
cartoonsurekha@gmail.com
తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన జంట బాపు రమణలు. మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.
విజయవర్ధన్ గారు,
మీరు బాపు గారిపై మూవీ తీస్తున్నారని తెలిసి శ్రీ బాపుగారి
అభిమాని గా చాలా సంతోషించాను.నేను దాదాపు ప్రతి ఏడాది
చెన్నై వెళ్ళినప్పుడల్లా బాపు,రమణ గారులను కలసి వస్తుంటాను.
నా దగ్గర బాపు,రమణ పుస్తకాలు,వారి సినిమాల ఆడియోవిడియో
సిడిలు,యల్పీ యస్పీ రికార్డులు,బొమ్మల ఆల్బమ్‌లు,ఇప్పటికి 9
వాల్యూమ్ చేశాను వున్నాయి.ఆంధ్రవారపత్రిక ముఖచిత్రం(1960)
(పెళ్ళికొడుకు,పెళ్ళికూతురు)బొమ్మ వుంది.మీరు బాపుగారిని కలసిన
మరునాడు (ఆగష్టు 2) బాపు,రమణ గార్లను కలిశాను
యంవీ.అప్పారావు(సురేఖ) కార్టూనిస్ట్.

Post a Comment