Sunday, August 2, 2009

శ్రీ బాపు కార్టూను రచన



ఈ శనివారం (ఆగస్టు 1, 2009) చెన్నై వెళ్ళాను. (ముళ్లపూడి వెంకట)రమణ గారి అమ్మాయి శ్రీమతి అనురాధ గారు (వారి కూతురితో) అమెరికా నుండి ఇండియా 2-3 వారాలకని వచ్చారు. అనురాధ గారిని ఇంట్లో "అమ్ములు" అంటారు. అనురాధ గారికి బాపుగారి వద్ద మిగతా పిల్లల కంటే చాలా చనువు వుండేదట (చిన్నప్పట్నించీ). వారైతే బాపు గారి గురించి, బాపు రమణ గార్ల సినిమా చర్చల గురించి చెబుతారని వెళ్ళాను. వారం క్రితం అనురాధ గారికి ఫోను చేసి విషయం చెప్పాను. వారి చెప్పే విషయాలు రికార్డు చేసుకుంటాననీ కూడా చెప్పాను. అయ్యో video recording అదీ వద్దని అన్నారు. కాని కాస్త బ్రతిమిలాడితే, బాపు గారు అమ్మాయి శ్రీమతి భానుమతి గారితో కలిపి ఒక్కసారి record చేస్తే కొంచెం ధైర్యంగా చెప్పగలనని అన్నారు. అప్పుడు భానుమతి గారికి ఫోన్ చేసి నా plan విన్నవించుకున్నాను. వారు తప్పకుండా రండి అని అభయమిచ్చారు. వెంటనే రైలు టిక్కేట్లు ఇంటర్నెట్లో కొనేసాను.

శనివారం మధ్యాహ్నం 1.30కి బాపు రమణ గారి ఇల్లు చేరాను. ఐతే ఆ శుక్రవారమే అనురాధ గారి తమ్ముడైన శ్రీ వర గారు మరియు వారి కుటుంబంతో చెన్నై వచ్చారు. వారందరు ఆ మధ్యాహ్నం బయటకు వేళ్ళారని తొందరగానే వస్తారని తెలిసుకొని మొదటి అంతస్థులో వున్న బాపు గారి గదికి వెళ్ళా (రమణ గారు రెండో అంతస్థులో వుంటారు). ఆ సమయంలో బాపు గారు ఒక పావుగంట (అవును పావుగంటే) నిద్రపోతారు. వారి పక్క గదిలో నా సామాను పెట్టుకొని, ఫ్యాను కింద సేదతీరాను. బాపు గారు నిద్ర లేచిన తర్వాత చాలా సేపు (దాదాపు గంటన్నర) మాట్లాడారు. వంశీ గారి కథలకు వేసిన బొమ్మల గురించి, ఈ మధ్యన బాపు గారు చూసిన సినిమాల గురించి ఇలా చాలా. కాసేపటికి కొన్ని పూర్తి చేయవలసిన కార్తూన్లు వున్నాయి అవి పూర్తిచేస్తాను అని కార్టూన్లు వేయనారంభించారు. అప్పటికే lining పూర్తి చేసుకునివున్నారు కాబోలు, బ్రష్ తో రంగులు, మెరుగులు దిద్దుతుంటే కొన్ని ఫోటోలు తీసాను. ఆ పని చేస్తూనే ఆ కార్టూన్ల వెనక వున్న కమామిషూ చెప్పారు.

ఐతే నే వెళ్ళిన అసలు పని అనురాధగారితో మాట్లాడటం. ఆ రోజు వర గారు అక్కడ వుండటం నాకు బాగా కలిసివచ్చింది. వరగారు అనురాధ గారిని చెప్పమని చాలా encourage చేసారు. దాదాపు 4.30కు మేడపైకి వెళ్ళి video recording మొదలుపెట్టాం. బాపు గారి అమ్మాయి శ్రీమతి భానుమతి గారు అనురాధగారికి company ఇచ్చారు. బానుమతి గారు చాలా విషయాలు చెప్పారు. ఆ ప్రవాహంలో అనురాధ గారు కూడా కలిసిపోయి, వారి జ్ఞాపకాలు పంచుకున్నారు. కాసేపటికి బాపు గారి చిన్నబ్బాయి వెంకట్ గారు కూడా recording లో పాలుపంచుకోవడంతో నా trip మరింత విజయవంతం అయ్యింది.

తర్వాత రమణ గారిని కలవటం, ఇంట్లో అందరితో మాట్లాడేసరికి రాత్రి 9.30 అయ్యింది. నా రైలు రాత్రి 11 గంటలకే. కాని భోంచేసేదాకా బాపు గారు, వారి కుటుంబ సభ్యులు నన్ను వదలలేదు. రుచికరమైన భోజనం చేసి 10గంటలకు బాపు రమణ గార్ల నుంచి , ఇంట్లో అందరినుంచి సెలవు తీసుకుని బయలుదేరాను.

9 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఎంత అదృష్టవంతులండి మీరు

Anonymous said...

You are the luckiest person on EARTH.
God Bless you.

భావన said...

బాగున్నాయండి కబుర్లు. మరి మీరు చేసిన ఇంటర్వ్యూ ఎప్పుడూ చదివే భాగ్యం కల్పిస్తారు.

విజయవర్ధన్ (Vijayavardhan) said...

Thank you.

భావన గారు, ఈ documentary ఒక సంవత్సరంలోగా పూర్తి చేయాలని ఆలోచన. నేను వేసిన ప్రశ్నలు తక్కువ. వారు చెప్పిన విషయాలే ఎక్కువ.

మురళి said...

విజయవర్ధన్ గారూ, నమస్తే.. మీ బ్లాగు చాలా బాగుంది.. చక్కని ప్రాజెక్ట్ తలపెట్టారు.. అభినందనలు.. వంశీ కథలకి వేసిన బొమ్మలగురించి బాపు గారు ఏం చెప్పారో తెలుసుకోవాలని ఉంది.. వీలయితే ఓ టపా రాయగలరా? మీకు వీలైతేనే సుమా...

సుజాత వేల్పూరి said...

చాలా బావుందండీ విజయమోహన్! నిజంగా అదృష్టవంతులు మీరు. బాపు గారి ఎదురుగా కూచుని....!

మీరు వేసిన ప్రశ్నలు ఎక్కువ, వారు చెప్పిన విషయాలు ఎక్కువ అన్నారంటే ప్రశ్నలు ఎంత సమర్థవంతంగా అల్లారా అని ఊహిస్తున్నాను.

మురళి అన్నట్లు వంశీ కథలకు వేసిన బాపూ బొమ్మల గురించి తెలుసుకోవాలని నాకూ ఉంది. చెప్తారా మరి!

అభినందనలు మీకు!

విజయవర్ధన్ (Vijayavardhan) said...

మురళి గారు, ట్hank you. నాకు వ్రాయటం రాదు. ఐనా ప్రయత్నిస్తాను.

Anonymous said...

Hope u finish ur project soon !!nice work!!

కొత్త పాళీ said...

Excellent. I am sure that video will be a valuable record of great memories.