Monday, May 4, 2009

ANRతో ముఖాముఖి


బాపు డాక్యుమెంటరి కోసం బాపు-రమణ ల మిత్రుడైన అక్కినేని నాగేశ్వరరావు కలవాలని ఎన్నో రోజులుగా అనుకుంటూ వున్నాను. మరి ఇంటర్వ్యు కావాలంటే appointment తీసుకోవాలి కదా. ఎలా? ఎవరిని అడాగాలి? ఎవరినో ఎందుకు బాపు గారినే అడిగేద్దామని, బాపు గారికి ఫోన్ చేసి, విషయం చెప్పాను. "రమణ గారు నాగేశ్వరరావు గారితో touch లో వున్నారు, రమణ గారిని అడగండి" అన్నారు. రమణ గారికి ఫోన్ చేస్తే, మా అబ్బాయి వర ("విశాఖ ఎక్స్ ప్రెస్" వీరు తీసిందే) ఐతే హైదరాబాదు లోనే వుంటాడు కాబట్టి, వర ని ఒక అర గంట ఆగి contact చేయండి ఈ లోపు నేను చెబుతాను అన్నారు. వర గారికి ఫోన్ చేస్తే "ANR గారి mobile నంబర్ వుందండి. ఫోన్ చేస్తే కలవట్లేదు. కొత్త నంబరు తీసుకున్నట్టున్నారు. ఐనా నా దగ్గర landline నంబరు కూడా వుంది. So, నేను try చేస్తాను" అన్నారు. 27 నుంచి 30 డిసెంబరు (2008 లో) దాకా హైదరాబాదు వుండేలాగా plan చేసుకున్నా. ఐతే, నేను బెంగళూరు నుంచి డిసెంబర్ 26 న బయలుదేరే వరకు appointment దొరకలేదు. వర గారేమో ఏం పర్వాలేదు వచ్చేయండి అన్నారు. కాక పోతే ఆదివారం (అంటే 28 న) ఉదయం ఫోన్ చేసి వెళ్ళొచ్చని తెలిసింది.

27 న హైదరాబాదు చేరుకున్నాను. వారం క్రితమే preparation (ఎలాంటి ప్రశ్నలు వేయాలి etc etc) చేసుకున్నా, మళ్ళీ 27 నాడు ఒక సారి notes review చేసుకున్నా. 28 న ఉదయం ఫోన్ చేస్తే ఇంకో గంట లో రమ్మంటే (నేనుండే ఘట్కేసర్ నుండి జూబిలి హిల్స్ కి కనీసం 2 గంటల ప్రయాణం) ఇబ్బంది కదా. అందుకే వరా గారితో సారాసరి ANR ఇంటి దాకా వెళ్ళి ఇంటి బయట నుంచి ఫోన్ చేసాము. ఇంటి బయట వున్నామని చెప్పాము. ANRగారి assistant ఒక అబ్బాయి బయటికి వచ్చి మాట్లాడాడు. 27 నాడు కుదరదు అన్నాడు. సాయంత్రమైనా కుదరదా అని అడిగాము. లేదు రవీంద్రభారథిలో ఏదో program వుందన్నాడు. 28 ఆదివారం సాయంత్రం రమ్మన్నాడు. సాయంత్రం అంటే light వుండదు (అసలే చలికాలం; తొందరగా sunset అవుతుంది) shooting కి problem అవుతుంది. మధ్యాహ్నం కదరదా అని అడిగాను. లేదు ప్రతి ఆదివారం family members అందరితో lunch వుంటుంది తర్వాత పడుకుంటారు అన్నాడు. ఇంకేమీ చేయలేము అని మర్నాడు వస్తానని చెప్పాను.

మర్నాడు (28) మధ్య్హాహ్నం 3 గంటలకు ఇంటిదాకా వెళ్ళి చూద్దాం/ప్రయత్నిద్దాం అని phone చేసాను. సారు వున్నారు, అడుగుతానన్నాడు. కాసేపట్లో నాగేశ్వరరావు గారే మాట్లాడారు. విషయం చెప్పాను. రమ్మన్నారు. గేటు దగ్గరికి వెళ్తే వారి assistant office గదిలో కూర్చోబెట్టాడు. ఆ గదిలో అంతగా వెలుతురు లేదు కదా అని ఆలోచిస్తుంటే అతను మంచినీళ్లు తెచ్చిచ్చాడు. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా shooting చేసుకోవచ్చా అని అడిగా. అతిథులు వచ్చినపుడు కలిసే గది చూపెట్టాడు. ఎవరైనా shooting చేసుకుంటే ఇక్కడే చేసుకుంటారు అని చెప్పాడు. ఆ గదికి వున్న అన్ని కిటికీలు తెరిచి చూసా ఐనా వెలుతురు సరిపోలేదు. ఒక కిటికీలోంచి ఇంటి వెనక వున్న garden కనపడింది. అక్కడ చేసుకోవచ్చా అని అడిగా. సారుని అడిగొస్తానన్నాడు. కాసేపటికి వచ్చి సరే అన్నారు అని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళి camera, tripod, mic సిద్ధం చేసుకున్నా.

కాసేపటికి నాగేశ్వర రావు గారు వచ్చారు. నమస్కారం చేసి, project గురించి చెప్పి, నాకు కావలసిన వివరాలు గురించి టూకీగా చెప్పాను. అలాగే అన్నారు. Collar mic ఐతే ఇబ్బంది పడతారని కొంచం powerful wireless lavalier mike తెచ్చాను. ఆ mic ని వారి శాలువాకి తగిలించాను. కాలరు అక్కరలేదా అని అడిగారు. పరవాలెదన్నాను. వీడియో ఆన్ చేసానండి అనగానే "హలో హలో వినపడుతోందా" అని అడిగారు. వారి presence of mind నాకు చాలా నచ్చింది. అందుకే ఆయన అంతటి నటుడయ్యారనుకున్నాను.

ఒక గంట సేపు మాట్లాడారు. మధ్యలో ఎవరో ఏదో పనిమీద వచ్చారు ఐనా ఇంటర్వ్యూ ఆపలేదు. నేనేమీ పెద్దా TV ఛానెల్ నుంచి రాలేదు. కావలంటే ఇంటర్వ్యూ ఆపి వారి పని చూసుకోవచ్చు. అలా చేస్తే ఆయన అంత గొప్ప నటుడు ఎందుకవుతాడు? కాసేపు వారి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు తర్వాత నా ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఇంటర్వ్యూ తర్వాత, ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆటోగ్రాఫ్ తీసుకున్నా (బుద్ధిమంతుడు VCD cover పైన). మా నాన్న ANRకి fan. అందుకే నాన్న పేరు మీదే ఆటోగ్రాఫ్ తీసుకున్నా. ఫోటో కూడా తీసుకున్నా :) నాగేశ్వర రావు గారిని కలవటం ఒక తీపి జ్ఞాపకం.

6 comments:

Unknown said...

Mottaniki Documentary yedi ??? :)

విజయవర్ధన్ (Vijayavardhan) said...

ఫజ్లుర్ గారు, డాక్యుమెంటరి పూర్తికావడానికి ఇంకా ఒక సంవత్సరం పట్టొచ్చు. కేవలం ఈ project సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ blog మొదలుపెట్టాను.

mohanrazz said...

baagundi mee prayatnam. ANR is a real legend!!

విజయవర్ధన్ (Vijayavardhan) said...

Thanksandi

Lakshmi Naresh said...

vijay garu...anni chadivi comment pedataanu...kaani meeru ANR garini kalavadam ..mee matalu,andulo feel bagunnayi(ila simple gaa cheppananukokandi,mee pani succes kavalani korukuntunnna).

విజయవర్ధన్ (Vijayavardhan) said...

lakshminaresh గారు. Thank you. మీ దగ్గర కాని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కాని బాపు గారి సినిమా సరకు ఏమైనా దొరికే అవకాశం వుంటే తెలపండి.